మేళ్లచెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయానికి రూ. 37.97 లక్షల ఆదాయం

మేళ్లచెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయానికి రూ. 37.97 లక్షల ఆదాయం
  • ఏడ్ల పందేల్లో విన్నర్‌‌కు ట్రాక్టర్, రెండో విజేతకు బుల్లెట్ బైక్ 
  • జాతరలో హుండీ, వివిధ రూపాల్లో  రూ. 37. 97 లక్షల ఆదాయం .

మేళ్లచెరువు,వెలుగు: మేళ్లచెరువులోని శంభులింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఐదు రోజుల  బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూర్ణాహుతితో పూజా క్రతువులు పూర్తయ్యాయి. స్వామి అమ్మవార్ల పవళింపు సేవ కనుల పండుగగా జరిగింది. భక్తులు సమర్పించిన ప్రధాన హుండీల కానుకలు మినహా వివిధ రూపాలలో ఈ జాతరకు  రూ. 37,97,850 ల ఆదాయం సమకూరినట్లు ఈఓ నాగెళ్ల శంభిరెడ్డి తెలిపారు.

ఎడ్ల పందేలలో సీనియర్ విభాగంలో హుజూర్‌నగర్ కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి గిత్తలు 2533 అడుగుల దూరాన్ని బండను లాగి ఫస్ట్ ప్రైజ్ గా ట్రాక్టర్ ను, కడప జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్ గిత్తలు 2250 అడుగుల దూరాన్ని బండను లాగి సెకండ్ ప్రైజ్ గా బుల్లెట్ మోటర్ సైకిల్ ను గెల్చుకున్నాయి. ఆయా కార్యక్రమాల్లో చైర్మన్ పెండ్లి లచ్చయ్య, సర్పంచ్ బచ్చు పద్మావతి శ్రీనివాసరెడ్డి, కొంకపాక రాధాకృష్ణ మూర్తి, విష్ణు వర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులుపాల్గొన్నారు.